మోంతా ఎఫెక్ట్ : మూడు రోజుల పాటు ఈదురుగాలులు.. భారీ వర్షాలు..

మోంతా ఎఫెక్ట్ :  మూడు రోజుల పాటు ఈదురుగాలులు.. భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను కారణంగా కర్నూలు జిల్లాలో మూడురోజుల పాటు (  అక్టోబర్​  27, 28, 29) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని   జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి  అధికారులను ఆదేశించారు. 

శనివారం ( అక్టోబర్​ 25)  కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  మోంతా తుఫాను చెన్నై తీరం వైపు నుంచి విశాఖపట్నం దిశగా గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదర గాలులతో కదులుతుంది.  దీని ప్రభావంతో  భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని... అందువల్ల అన్ని శాఖలు అప్రమత్తంగా కర్నూలు జిల్లా కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.

తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మరియు అన్ని విభాగాల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08514–293903 ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వొచ్చన్నారు.. ఎవరైనా ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్  నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన లక్ష్యమని ప్రతి అధికారి తన విభాగానికి సంబంధించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు