కర్నూలు జిల్లాలో వాహనదారులకు అవేర్ నెస్ ప్రోగ్రాం.. ఓవర్ స్పీడ్.. హెవీ లోడ్ తో వెళ్లొద్దు..!

కర్నూలు జిల్లాలో వాహనదారులకు అవేర్ నెస్ ప్రోగ్రాం..  ఓవర్ స్పీడ్.. హెవీ లోడ్ తో వెళ్లొద్దు..!

కర్నూలు జిల్లా బస్​ ప్రమాదం జరగడంతో  జిల్లా పోలీస్​ యంత్రాంగం అప్రమత్తమైంది.  రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్నూలు రేంజ్​డీఐజీ కోయ ప్రవీణ్ , ఎస్పీ విక్రాంత్ పాటిల్​  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  ప్రతి శనివారం రోడ్డు భద్రత కార్యక్రమాను నిర్వహించి.. ప్రజలను అవేర్​ నెస్​ కల్పించాలని పోలీసులకు ఆదేశించారు. 

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారించివచ్చన్నారు.  కర్నూలు జిల్లా వ్యాప్తంగా  అక్టోబర్​ 25న   రోడ్డు భద్రత ,  ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన ప్రజలకు కల్పించారు.  మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

ద్విచక్రవాహనాలు  నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని..  ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళరాదన్నారు.  ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్​ చేయకూడదని ప్రజలకు వివరించారు.  డ్రంక్​ అండ్​ డ్రైవ్​ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ ఏడాది ( 2025)  జనవరి నుంచా  అక్టోబర్ 24 వరకు  జిల్లా వ్యాప్తంగా  7వేల 248 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ...  14 వేల 182  ఓపెన్ డ్రింకింగ్ కేసులు  నమోదు చేసినట్లు వివరించారు.  మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల నివారణకు  డ్రంకెన్ డ్రైవ్ , ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్ 29 వ తేది నుంచి  అక్టోబర్ 24 వరకు 85 స్టాఫ్​ వాష్ అండ్ గో కార్యక్రమాలను నిర్వహించారని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  తెలిపారు.