ఓఆర్ఆర్ పై తగలబడ్డ కారు.. పూర్తిగా దగ్ధం

ఓఆర్ఆర్ పై  తగలబడ్డ కారు.. పూర్తిగా దగ్ధం

హైదరాబాద్  ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో  ఉన్న  కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  పోలీసుల వివరాల ప్రకారం గచ్చిబౌలి నుంచి   నానక్‌రామ్‌గూడ వైపు   ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్తోన్న   ఐ10 కారులో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  విషయాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారు దిగాడు. నిమిషాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. 

దీంతో ఓఆర్‌ఆర్‌పై తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్థానికులు నార్సింగి ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకోని మంటలను ఆర్పివేయించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు. అనంతరం కారును పక్కకు జేసీబీతో తీయించారు.