రెండ్రోజుల్లో పెండ్లి..అంతలోనే ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

రెండ్రోజుల్లో పెండ్లి..అంతలోనే ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

చేవెళ్ల, వెలుగు: రెండ్రోజుల్లో పెండ్లి ఉండగా, పత్రికలు పంచుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వికారాబాద్​జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన పటేల్ ప్రవీణ్​కు ఈ నెల 5న వివాహం ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో పెళ్లి కార్డులు రెడీ చేయించి బంధువులకు పంచుతున్నాడు.

మంగళవారం ఉదయం తన కారులో పత్రికలు పెట్టుకుని చేవెళ్ల వైపు వెళ్తుండగా, చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ వద్దకు రాగానే టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.