మెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

మెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

మల్కాజిగిరి, వెలుగు: బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా సాయం అందించడం కేవలం దాతృత్వమే కాకుండా, భవిష్యత్ ఆరోగ్య రంగానికి పెట్టుబడిగా భావించాలన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో ‘వైట్ కోట్ విప్లవం’ సాకారమైందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.