100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

పరిగి, వెలుగు : తమ పొలాలకు నీరందించేందుకు 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ మంజూరు చేయాలని పరిగి మండలం చిగూరాల్​పల్లి అనుబంధ గ్రామమైన కొంకులగడ్డ రైతులు డిమాండ్​చేశారు. మంగళవారం పరిగి విద్యుత్ సబ్​స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రెండు రోజుల క్రితమే 60 కేవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్​ను మరమ్మతు చేయించి తెచ్చినప్పటికీ, అది ఒక్క రోజు కూడా సరిగ్గా పనిచేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో నాటు వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోందని ఆవేదన చెందారు. సాగు నీరు అందక పంట నష్టపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే 100 కేవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.