మలక్ పేట, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఐఎస్ సదన్ ఎస్సై జి. వెంకటేశ్‌ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం సస్పెండ్ చేశారు. వినాయక చవితి బందోబస్తు, సీఎం రూట్, ఎన్నికల విధులు, లోక్‌అదాలత్ సమావేశాలకు గైర్హాజరు కావడంతో పాటు రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమవ్వడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అంతేకాకుండా విధుల్లో మతపరమైన భేదాలు చూపడం, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించడం వల్ల టీజీసీఎస్ నియమావళి ప్రకారం ఈ సస్పెన్షన్ వేటు పడింది.
