హైదరాబాద్: 2025, అక్టోబర్ 26న హుజుర్ నగరలో నిర్వహించనున్న జాబ్ మేళా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో మళ్లీ జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హుజుర్ నగర్లో శనివారం (అక్టోబర్ 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా శనివారం (అక్టోబర్ 26) హుజుర్ నగర్లో మెగా జాబ్ మేళా జరిగిందన్నారు.
2,259 కంపెనీలు పాల్గొనగా 20,463 మంది యువత హాజరయ్యారని తెలిపారు. 3041 మందికి జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చారని.. మరో 1533 మందికి కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వెనుకబడిన కులాల వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
►ALSO READ | కార్తీకమాసం.. ఆధ్యాత్మిక యాత్ర.. తెలంగాణ ఆర్టీసీ ప్యాకేజీ వివరాలు ఇవే..!
అర్హత ఉండి ఉద్యోగాలకు కోసం ఎదరు చూస్తోన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
