కార్తీకమాసం.. ఆధ్యాత్మిక యాత్ర.. తెలంగాణ ఆర్టీసీ ప్యాకేజీ వివరాలు ఇవే..!

కార్తీకమాసం.. ఆధ్యాత్మిక యాత్ర.. తెలంగాణ ఆర్టీసీ ప్యాకేజీ వివరాలు ఇవే..!

కార్తీకమాసం కొనసాగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.  కార్తీకమాసంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్​ న్యూస్​ చెప్పింది.   హైదరాబాద్‌లోని దుండిగల్ నుంచి అరుణాచలం, వేములవాడ, శ్రీశైలం వంటి వివిధ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.  కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ప్యాకేజ్‌లను ప్రకటించారు..

అరుణాచలం   టూర్​  :  మూడు రోజులు
పర్యాటక ప్రదేశాలు  :  అరుణా చలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి క్షేత్రాలు
ప్యాకేజీ  ఛార్జీల వివరాలు :  పెద్దలకు రూ. 4,500, పిల్లలకు రూ. 2,400

శ్రీశైలం టూర్ ప్యాకేజ్ :   ఒక్క రోజు  ...
పర్యాటక ప్రదేశాలు  : మైసిగండి, శ్రీశైలం డ్యామ్, శిఖరం శ్రీశైలం
ప్యాకేజీ  ఛార్జీల వివరాలు :  పెద్దలకు రూ. 1, 500....పిల్లలకు రూ. 900

విజయవాడ టూర్ ప్యాకేజ్ : ఒక్క రోజు  ...
పర్యాటక ప్రదేశాలు  :  చెరువుగట్టు, విజయవాడ దుర్గమ్మ గుడి  
ప్యాకేజీ  ఛార్జీల వివరాలు :  పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 850 
 
వేములవాడ టూర్ ప్యాకేజ్​ : ఒక్కరోజు 
పర్యాటక ప్రదేశాలు  :   ధర్మపురి, కొం డగట్టు, వేములవాడ 
 ప్యాకేజీ  ఛార్జీల వివరాలు :   పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 650 

జోగులాంబ మంత్రాలయం టూర్ ప్యాకేజ్...: ఒక్కరోజు 
పర్యాటక ప్రదేశాలు :  జోగులాంబ అమ్మవారి దర్శనం, కూలబ్రహ్మేశ్వర స్వామిగుడి, పురాతన శివాలయం, బీచ్‌పల్లి హనుమాన్ టెంపుల్, రాఘవేంద్రస్వామి వేంకటేశ్వర స్వామి టెంపుల్  
 ప్యాకేజీ  ఛార్జీల వివరాలు :    పెద్దలకు రూ. 1950, పిల్లలకు రూ. 700 

ఇక, ఇతర ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9958226150, 7671014280, 9866283555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.