Ajith Kumar: తల అజిత్ ఆధ్యాత్మిక యాత్ర: ఛాతీపై అమ్మవారి టాటూ, షాలినీ పోస్ట్ వైరల్!

Ajith Kumar: తల అజిత్ ఆధ్యాత్మిక యాత్ర: ఛాతీపై అమ్మవారి టాటూ, షాలినీ పోస్ట్ వైరల్!

తమిళ సినీ ఇండస్ట్రీలో 'తల'గా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న నటుడు అజిత్ కుమార్. ఈ స్టార్ హీరో ఇప్పుడు సినిమాలకు, కార్ రేసింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణంలో మునిగిపోయారు. లేటెస్ట్ గా ఆయన..  భార్య, మాజీ నటి షాలినీ, కుమారుడు ఆద్విక్‌తో కలిసి కేరళలోని పాలక్కాడ్‌లో ఉన్న ఒక ప్రాచీన ఆలయాన్ని సందర్శించారు.  ఇప్పుడు ఆ చిత్రాలు  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అజిత్ ఛాతీపై  కనిపించిన అమ్మవారి టాటూ నెటిజన్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.

సంప్రదాయ దుస్తుల్లో తల ఫ్యామిలీ..

షాలినీ అజిత్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మధురమైన కుటుంబ క్షణాలను పంచుకున్నారు. 'ఆశీస్సులు, ఆత్మీయతతో కూడిన ఒక రోజు...' అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. అజిత్, కొడుకు ఆద్విక్ ఒకే రకమైన సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు. షాలినీ సింపుల్‌గా కనిపించారు. తమ అభిమాన నటుడిని ఇలా కుటుంబంతో కలిసి భక్తిభావంతో ఉన్న ఫిక్స్ చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఫ్యాన్స్.

ఆధ్యాత్మిక టాటూ రహస్యం

అయితే, ఈ చిత్రాలలో అభిమానులను అత్యంత ఆశ్చర్యపరిచిన అంశం అజిత్ ఛాతీపై కనిపిస్తున్న దైవ రూపంలోని టాటూ. అజిత్ అత్యంత వ్యక్తిగత విషయాలను కూడా రహస్యంగా ఉంచుతారు. అలాంటిది, తొలిసారిగా ఆయన శరీరంపై ఇంత స్పష్టంగా ఒక ఆధ్యాత్మిక ముద్ర కనిపించడం అభిమానులను ఉర్రూతలూగించింది.  నెటిజన్లు ఈ టాటూ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అందులో ఒక అభిమాని, ఆ టాటూ ఊటుకులంగర భగవతి అమ్మవారిది అని గుర్తించారు. ఇది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని పెరువెంబ గ్రామంలో కొలువైన శక్తివంతమైన దేవత. ఇది అజిత్ కుటుంబానికి చెందిన కులదైవం కావడంతో.. ఆ ఆలయాన్ని ఆయన తరచుగా సందర్శిస్తారని, అందుకే ఆయన ఆ దైవాన్ని తన ఛాతీపై శాశ్వత ముద్రగా వేయించుకున్నారని అభిమానులు వెల్లడించారు.

 

ఇక సినిమా విషయానికి వస్తే .. అజిత్ ఇటీవలే  'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'AK64' మూవీ కోసం సిద్ధమవుతున్నారు. మోటార్ స్పోర్ట్స్‌లో కెరీర్ కోసం కుటుంబ సమయాన్ని త్యాగం చేశానని అజిత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే భార్య షాలినీ మద్దతు వల్లే తాను ఇదంతా చేయగలిగానని తెలిపారు. ప్రస్తుతం కాస్త విరామం దొరకడంతో తన కుటుంబంతో కలిసి  ఆధ్యాత్మిక ప్రయాణంలో  ఉన్నారు.

►ALSO READ | Allu Arjun: రెండు లారీల పేపర్లు రెడీ చేయండి! 'శివ' రీ-రిలీజ్‌పై అల్లు అర్జున్ స్పెషల్ వీడియో వైరల్!