సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు సినిమాలుగా కాకుండా .. ఒక తరం జ్ఞాపకాలుగా చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి వాటిల్లో కల్ట్ క్లాసిక్ 'శివ' ఒకటి. 1989లో వచ్చిన ఈ మూవీ కొత్త శకానికి నాంది పలికింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. కాలేజీ రాజకీయాలు, గ్యాంగ్ వార్లను వాస్తవికతకు దగ్గరగా చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో శివ సైకిల్ చైన్ వంటి సాధారణ వస్తువులను పోరాట సన్నివేశాలకు ఉపయోగించి వర్మ అప్పటి ఫార్ములా సినిమాల నుంచి బయటపడి కొత్త ట్రెండ్ సృష్టించింది.
థియేటర్స్ కు రెండు లారీల పేపర్స్..
ఇప్పుడు ఈ 'శివ' మూవీ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మన శివ మూవీ విడుదలై దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ చిత్రంగా నిలిచిందని అన్నారు. ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈ సారి థియేటర్స్ కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు.
ALSO READ : ఇంత క్యారెక్టర్ లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా..
రెండు లారీల థాంక్స్..
ఈ వీడియోను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్.. నీకు రెండు లారీల థాంక్స్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సరసన అమల నటించారు. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ శివ మూవీ కి యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అప్పట్లో తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
ఆ కాలంలో యువతను ఉర్రూతలూగించిన 'శివ'ను ఇప్పుడు కొత్తతరం ప్రేక్షకులు పెద్ద తెరపై 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో చూసే అవకాశం లభించింది. ఈ రీ-రిలీజ్, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు, తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని సరికొత్తగా అనుభూతి చెందడానికి ఒక అరుదైన అవకాశం. ఈ సినిమాతో నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది, అదే విధంగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఈ రీ-రిలీజ్ పాత, కొత్త ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి మరి.
