నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , దీక్షిత్ శెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు ( శనివారం అక్టోబర్ 25న ) ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో మనం చిన్న బ్రేక్ తీసుకుందామా. . చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్ లా అని రష్మిక డైలాగ్ తో స్టార్ట్ అవుతోంది. నువ్వు విక్రమ్ తో ఉన్నప్పుడు హ్యాఫీగా ఉన్నావా.. విక్రమ్ కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్ .. కానీ వాడు నీకు కరెక్ట్ కాదు అంటూ.. ఇమ్మాన్యుయేల్ రష్మికకు సలహా ఇస్తుంది.
మరో సీన్ లో ఇంత క్యారెక్టర్ లేస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా .. అంటూ రావు రమేష్ రష్మిక చెంప పగలగొట్టారు. . ఈ లవ్ విషయంలో రావు రమేష్, దీక్షత్ శెట్టికి మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది. ఇంత వరస్ట్ ఫాదర్ వి రా నువ్వు అంటూ కొట్టుకుండారు. ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
