సాంకేతిక యుగంలో రోజురోజుకు ఎన్నో అప్ డేట్ అవుతున్నాయి. మనుషులు అంతరిక్షలంలోకి వెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా.. వెనుబడిన వర్గాల వాళ్లను అంటరాని వాళ్లుగా చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మనుషులు మారడం లేదు.. ఇంకా అధ:పాతాళంలోనే ఉంటున్నారు. మతం పిచ్చి..కులం పిచ్చిని నరనరాన నింపుకుంటున్నారు. కరీంనగర్ లో జరిగిన ఓ ఘటనను చూస్తే మారుమూల గ్రామాల్లో కుల వివక్ష ఇంకా ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది.
ఇల్లు ఖాళీగా ఉంటే రెంట్ కు ఇవ్వడం కామన్. చాలా మంది ఇంటి బయట గేటుకు టూ లెట్ బోర్డు తగిలిస్తారు. యజమాని ఫోన్ నంబర్.. ఫ్యామిలీకైతే..ఓన్లీ ఫ్యామిలీ అని..బ్యాచిలర్స్ అయితే ఓన్లీ బ్యాచిలర్స్ అని టూ లెట్ బోర్డు పెడతారు ఎవరైనా.. కానీ కరీంనగర్లో ఇంటిని అద్దెకు ఇచ్చే క్రమంలో టూ లెట్ బోర్డుపై ఇంటి ఫోన్ నంబర్ తో పాటు కేవలం ఓన్లీ హిందూస్... నో ఎస్సీ, ఎస్టీ అని బోర్డులు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది . ఇది చూసిన వాళ్లు ఇలా ఉన్నారేంట్రా బాబు అని ..మీరు మీ కుల పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
►ALSO READ | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై NueGo ట్రావెల్స్ బస్సు బోల్తా.. మియాపూర్ నుంచి వెళ్తున్న బస్సు
కరీంనగర్ కిసాన్ నగర్ లో ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు అద్దెకి ఇవ్వబడదని.. కేవలం హిందువులకు మాత్రమే ఇంటిని అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు వెలిశాయి. ఇలా రెండు మూడు ఇండ్లకు ఇలాంటి బోర్డులే ఉన్నాయి.
ఇది చూసిన వాళ్లు షాకయ్యారు. వీళ్లేంటి ఇలా బోర్డులు పెట్టారని చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ బోర్డులు చూసిన వాళ్లు చాలా మంది విమర్శలు చేయడంతో వెంటనే ఆ టూ లెట్ బోర్డులను తొలగించారు ఇంటి యాజమానులు. కులవివక్ష చూపుతు పెట్టిన బోర్డులు వివాదాస్పదం కావడంతో.. నారాయణ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు పోలీసులు.
