హైదరాబాద్: హైదరాబాద్లో మరో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నియో గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు తిరగబడింది. బస్సు నంబర్ AP 39 UP1963.. రంగారెడ్డి జిల్లా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు బోల్తా పడింది. 20 మంది ప్రయాణికులతో మియా పూర్ నుంచి బయలుదేరిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పఠాన్ చెరువు దగ్గర ఔటర్ ఎక్కి పెద్దఅంబర్ పేట్ దగ్గర దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు, స్థానికులు, ఔటర్ సిబ్బంది సహాయక చర్యల్లో భాగమై క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది చనిపోయిన ఘటన జరిగిన 24 గంటల్లో వ్యవధిలోనే ఇలా జరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
