వరంగల్‌సిటీ, వెలుగు : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రోజు రోజుకూ చిల్లీ రేట్లు పెరు గుతోంది. తాజాగా వరంగల్ జిల్లా • ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి రికార్డ్ ధర పలికింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ఐలపల్లి గ్రామానికి చెందిన వినోద్ మూడు క్వింటాళ్ల వండర్ హాట్ రకం మిర్చిని బుధవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వాలిటీ బాగుండడంతో క్వింటాల్ మిర్చి రికార్టు స్థాయిలో రూ. 37,100కు అమ్ముడైంది.
గత నాలుగేండ్లలో ఇదే రికార్డు ధర అని మార్కెట్ ఆఫీసర్లు చెప్పారు. ఈ సంవత్సరం అకాల వర్షంతో మిర్చి పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
