రాష్ట్రంలో 12 లక్షల మందికి డిజి టల్ శిక్షణ పూర్తి : మంత్రి జితిన్ ప్రసాద

రాష్ట్రంలో 12 లక్షల మందికి డిజి టల్ శిక్షణ పూర్తి : మంత్రి జితిన్ ప్రసాద
  •     ఎంపీ రఘురాం రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఆన్సర్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో డిజిటల్‌‌‌‌ అక్ష రాస్యత గణనీయంగా పెరిగిందని కేంద్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌‌‌‌ సాక్షరత అభియాన్‌‌‌‌ (పీఎంజీడీఐఎస్ హెచ్ఏ) స్కీమ్ కింద తెలంగాణలో మొత్తం14,56,226 మంది నమోదు కాగా, అందులో 12,10,448 మంది విజయవంతంగా డిజిటల్‌‌‌‌ శిక్షణ పూర్తి చేశారని తెలిపా రు. 

ఇందులో 7,63,651 మంది మహిళలు, 4,46,777 మంది పురుషులు కోర్సు పూర్తి చేశారని చెప్పారు. ఈ మేరకు బుధవారం లోక్ సభలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రామీణ–పట్టణ డిజిటల్‌‌‌‌ అంతరాన్ని తగ్గించడంలో ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తున్నదని వెల్లడించారు.