
హైదరాబాద్.. చదువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు, బతకడానికీ.. అన్నింటికీ అనువైన నగరం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తుంటారు. అలా అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి ఇదైతే షాకింగ్ న్యూసే. ఎందుకంటే మధురానగర్ లో ఓ ఇంటి యజమాని చేసిన పని అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మధురనగర్ లో అద్దె ఇంట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపింది. జవహర్‌నగర్ లో తమ ఇంట్లో ఉంటున్న జంట బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది గమనించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు భార్యాభర్తలు. ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రీషియన్ చింటూ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
బల్బు హోల్డర్లో సీక్రెట్ కెమెరా..
ఎలక్ట్రీషియన్ తో కలిసి ఓనర్ అశోక్ యాదవ్ చేసిన నిర్వాకం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్ రూమ్ లో బల్బు పని చేయడం లేదని అద్దెకు ఉండే జంట ఓనర్ కు చెప్పారు. దీంతో అక్టోబర్ 4న బల్బు ఓల్డర్ లో సీక్రెట్ కెమెరాను అమర్చారు.
ఓల్డర్ లో సీక్రెట్ కెమెరా గుర్తించి అక్టోబర్ 13న ఓనర్ కు చెప్పగా ముందు బల్బ్ మార్చారు. ఈ విషయంపై బయటకి తెలిస్తే ఎలక్ట్రిషియన్ చింటూ పగబడ్తాడాని.. అతను ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదని జంటను బెదిరించాడు ఓనర్. ఎవరికీ చెప్పకపోతే సేఫ్ గా ఉంటారని భయపెట్టాడు.
దీంతో ఎలక్ట్రీషియన్ తో పాటు ఓనర్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ భార్యాభర్తలు. ఓనర్ అశోక్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.