అక్షయ్ కుమార్ స్పెషల్26 సినిమా గుర్తుందా.. సేమ్ అలాంటి దోపిడే ఇది.. కానీ సీన్ ఎలా రివర్స్ అయ్యిందో చూడండి !

అక్షయ్ కుమార్ స్పెషల్26 సినిమా గుర్తుందా.. సేమ్ అలాంటి దోపిడే ఇది.. కానీ సీన్ ఎలా రివర్స్ అయ్యిందో చూడండి !

ఈజీ మనీ కోసం జనాలు ఎలా పాకులాడుతున్నారో ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా సేమ్ టు సేమ్ సినిమా స్టైల్ రాబరీకి ప్లాన్ చేసి ఇరుక్కు పోయారు ఈ కిలాడీ దొంగలు. అది సినిమా.. ఫైనల్ గా హీరోదే పైచేయి అన్నట్లుగా కథలుంటాయి. కానీ ఇది నిజ జీవితం.. ఎప్పటికీ పోలీసులదే పై చేయి ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. 

అక్షయ్ కుమార్ సినిమా స్పెషల్ 26 స్టోరీ తెలిసే ఉంటుంది. పనిచేస్తున్న ఇంటిపైనే కన్నేసి.. ఈడీ అధికారుల  మాదిరిగా వచ్చి డబ్బు కొట్టేయాలని చూస్తాడు హీరో. అదే ప్లాన్ ను మక్కికి మక్కీ దించాలనుకున్నారు.. కొంతమేరకు సక్సెస్ అయ్యారు కూడా.. కానీ.. చివరికి దొరికిపోయారు. అదెలాగో చదవండి. 

దోపిడీకి ప్లాన్ చేశారిలా..

ఢిల్లీలో జరిగిన ఈ దోపిడీ కేసులో ఇద్దరు మహిళలు.. అందులో ఒకరు తన యజమానికే టోకరా వేయాలనుకున్న పనిమనిషి రేఖా దేవిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పురుష అనుమానితులు పరారీలో ఉన్నారు. అందులో ఇండియా-టిబెట్ బార్డర్ పోలీస్  (ITBP) అధికారి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉండటం పోలీసులను షాకింగ్ కు గురిచేసింది. 

ఫిబ్రవరి నెల మొదటి వారంలో ముగ్గురు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులు న్యూ ఫ్రెండ్స్ కాలనీలోకి ఎంటరయ్యారు. రిటైర్డ్ ఆర్టిటెక్ట్ అయిన ఆర్సీ సబర్వాల్ (86) ఇంట్లోకి అధికారుల మాదిరిగా దర్పంగా ప్రవేశించి అందరి దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. తాము ఈడీ (ED) ఆఫీసర్స్.. సర్చ్ ఆపరేషన్ ఉంది.. సహకరించాలని అందరినీ ఒక రూమ్ లో బంధించారు. 

దంగలు సెర్చ్ ఆపరేషన్ లో ఉండగా.. వారి వ్యవహార శైలిపై డౌట్ వచ్చి.. బాధితుని మనవడు అడ్డుకున్నాడు. దీంతో.. దొరికింది చాలు అనుకుని సుమారు మూడు నాలుగు లక్షల క్యాష్, ఏడు లగ్జరీ వాచ్ లతో పరారయ్యారు. 

ఎలా పట్టుకున్నారు..? 

బాధితుల ఫిర్యాదు మేరకు CCTV ఫుటేజ్ ఎనాలిసిస్ చేసి, పూర్తిగా టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. మొత్తం హై-స్పీడ్ ట్రాఫిక్ కెమెరాలతో సహా 350 కి పైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించి నేరస్తులు సారాయ్ కాలే ఖాన్ ప్రాంతం మీదుగా, ఘాజీపూర్ సరిహద్దు మీదుగా, ఉత్తరప్రదేశ్‌లోకి ఎంటరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత సిగ్నల్ ట్రాక్ చేస్తూ వెళ్లగా ఒక  కాలిబాటలో  ఘజియాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించారు. కాలీబాట గుండా వెళ్లగా  అక్కడ నేరస్తులు  ఉపయోగించిన వాహనం పార్క్ చేసి పారిపోయారు. 

ఆ తర్వాత మొబైల్ టవర్ డంప్ డేటాతో సహా సాంకేతిక నిఘా పద్ధతులను ఉపయోగించి పార్కింగ్ ప్రదేశంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌లను గుర్తించారు.

సిగ్నల్ ఎనాలిసిస్ చేయగా.. పూజా రాజ్‌పుత్ అనే మహిళ ఇంటి దగ్గరు సూచించింది. బాధిత యజమాని ఇంటి పనిమనిషి రేఖ దేవి అదే అడ్రస్ కు తరచుగా వెళ్లి వస్తున్నట్లు  స్థానిక నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో పూజా రాజ్‌పుత్ అనే మహిళ రేఖా దేవి వదిన అని పోలీసులు క్లారిటీకి వచ్చారు. 

బుధవారం పూజా రాజ్‌పుత్ ఇంటిపై పోలీసులు దాడి చేసి, దోపిడీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో  డిప్యూటీ కమాండెంట్-ర్యాంక్ ITBP యూనిఫాం, నకిలీ గుర్తింపు కార్డులు, వైర్‌లెస్ హ్యాండ్‌సెట్, ఎక్స్ పైరీ అయిన లైసెన్స్‌ పిస్టల్ ఉన్నాయి.

నిందితుల నుంచి  ఆభరణాలు , ఏడు  స్వాధీనం చేసుకున్నారు.  ఇంటి పనిమనిషి రేఖా దేవి ఈ దోపిడీకి ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. పూజా రాజ్‌పుత్‌ను కూడా కుట్రలో భాగమని పేర్కొన్న పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేశారు.

పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు లలో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రకాష్ తో పాటు మనీష్, రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉపదేశ్ సింగ్ థాపాగా గుర్తించారు. దోపిడీకి ఉపయోగించిన బాలెనో కారు థాపా పేరు మీద రిజిస్టర్ అయినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఈ ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.