న్యూఢిల్లీ : హైదరాబాద్ కు చెందిన పాణినియన్ ఇండియా కంపెనీ ప్రైవేట్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో చరిత్ర సృష్టించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ కోసం పవర్ అందించే టర్బోఫ్యాన్ ఇంజిన్ డిజైన్ ను పూర్తి చేసింది. ఇప్పుడు టెస్టింగ్, వాలిడేషన్, పూర్తి ఇంజిన్ సర్టిఫికేషన్ వంటివి చేపట్టనుంది.
ఇప్పటి వరకు డీఆర్‌డీఓ మాత్రమే ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేసింది. పాణియన్ ‘యంతూర్ 4.5 కిలోన్యూటన్ (కేఎన్) టర్బోఫ్యాన్ ఇంజిన్’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీంతో పాటు ‘స్వాయత్ ఎల్1’ లాంగ్-రేంజ్ అటానమస్ క్రూజ్ మిస్సైల్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా డెవలప్ చేస్తోంది.
భారత లాంగ్-రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) అవసరాలను తీర్చడానికి యంతూర్ ఇంజిన్ ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ఇదే ఇంజిన్ కోర్‌ను మరింత విస్తరించి, 12.5 కేఎన్ సామర్థ్యం గల ఇంజిన్‌ను డెవలప్ చేయొచ్చు.
అప్పుడు దీనిని చిన్న పాటి యుద్ధవిమానాలు, డ్రోన్లలో వాడడానికి వీలుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్‌ను వేగంగా పూర్తి చేయడానికి సంస్థ సుమారు రూ. 25 కోట్ల నిధులను సేకరించాలని చూస్తోంది.
