నిఫ్టీ ఏడాది టార్గెట్‌@27,019.. మనుపటి అంచనాను పెంచిన పీఎల్ క్యాపిటల్

నిఫ్టీ ఏడాది టార్గెట్‌@27,019.. మనుపటి అంచనాను పెంచిన పీఎల్ క్యాపిటల్

హైదరాబాద్​, వెలుగు: దేశీయ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ప్రభుదాస్​లీలాధర్​(పీఎల్) క్యాపిటల్ సంస్థ నిఫ్టీ ఒక ఏడాది లక్ష్యాన్ని 27,019కి పెంచింది. మునుపటి అంచనా 26,449గా ఉండేది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, దేశీయంగా డిమాండ్ బలపడడంతో మార్కెట్లు కోలుకుంటున్నాయి. 

అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్‌నినో వాతావరణ మార్పులు మార్కెట్లకు ప్రధాన ముప్పుగా మారే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఎన్​బీఎఫ్​సీ, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, టెలికం, జ్యుయలరీ, హాస్పిటల్స్ రంగాలు వృద్ధిని సాధించే అవకాశం ఉంది. 

ఆటో, ఐటీ సర్వీసెస్, సిమెంట్ రంగాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు బాగున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

గ్రామాల్లో డిమాండ్ నిలకడగా ఉన్నప్పటికీ వర్షపాతం తీరును బట్టి వ్యవసాయ రంగం ఆధారపడి ఉంటుందని ఈ స్టడీ వెల్లడించింది.