హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి తమ ఆపరేటింగ్ ఫ్లీట్ సంఖ్యను 10 వేల వాహనాలకు పెంచుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బైక్‌వో గ్రీన్ టెక్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.76 కోట్లకు పైగా నిధులను సమీకరించి ఈ విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల నుంచి ఈవీ అసెట్ ఓనర్‌షిప్, లీజింగ్, లాజిస్టిక్స్ రంగానికి కంపెనీ మారుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో ఎనర్జీ డివిజన్‌కు ప్రత్యేక ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను అందించనున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.66.46 కోట్లు. రవాణా రంగంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాలలో పెద్ద ఎత్తున వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఈఓ హితేన్ పాల్ సక్సేనా తెలిపారు.
