బిగ్‌‌‌‌బాస్షోతో ఫర్నిచర్ కంపెనీ నీల్‌‌‌‌కమల్ జోడీ 

బిగ్‌‌‌‌బాస్షోతో ఫర్నిచర్ కంపెనీ నీల్‌‌‌‌కమల్ జోడీ 

హైదరాబాద్​, వెలుగు: ఫర్నిచర్ కంపెనీ నీల్‌‌‌‌కమల్ లిమిటెడ్‌‌‌‌కు చెందిన మ్యాట్రెస్ బ్రాండ్ నీల్‌‌‌‌కమల్ స్లీప్ తాజా సీజన్ బిగ్‌‌‌‌బాస్ తెలుగు షోతో అధికారిక అసోసియేట్ స్పాన్సర్‌‌‌‌గా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం ద్వారా బిగ్‌‌‌‌బాస్ హౌస్‌‌‌‌లో వంద రోజులకు పైగా ఈ మ్యాట్రెస్‌‌‌‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కంటెస్టెంట్ల బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లలో బౌన్స్ ఫోమ్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్‌‌‌‌లను ఈ బ్రాండ్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో అత్యంత ఆదరణ పొందిన తమ బ్రాండ్, ఈ షో ద్వారా ప్రేక్షకుల మధ్య మరింత బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని చూస్తోందని నీల్​కమల్​ తెలిపింది.