- ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఆఫీసర్‌కు రిపోర్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ స్లోగా సాగుతుండటంపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్‌ను రంగంలోకి దించారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గంలో ఎక్కువ శాతం, మరికొన్ని నియోజకవర్గాల్లో తక్కువ శాతం నమోదవుతుండగా స్పీడప్ చేయాలని బీఎల్ వోలను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే వారిని గుర్తించేందుకు విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. వీరు సర్వే జరుగుతున్న ప్రాంతాలకు ఆకస్మికంగా వెళ్లి ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నారు.
సర్వే ఎలా సాగుతోంది? బీఎల్వోలు ఇండ్లకు వెళ్తున్నారా? లేదా? ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారా లేదా? అనే వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు కమిషనర్‌కు రిపోర్ట్చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను జూలై 24 లోపే పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్గడువు ఇవ్వగా, అనుకున్న టైంలోపు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఆగస్టు 3 వరకు పొడిగించింది. దీంతో ఈ టైంలోపే ఎట్లాగైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో జిల్లా ఎన్నికల అధికారి విజిలెన్స్‌ను ఫీల్డ్‌లోకి దింపారు.
