ఆనంద్ సాయి కొడుకు బి. శివ సందీప్ సాయి ఆనంద్ (23) డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఆగస్టు 31వ తేదీన ఉదయం.. నానక్‌రామ్‌గూడ ORR రోటరీ, ఖజాగూడలను కలిపే రోడ్పై జరిగిన ప్రమాదంలో ఆనంద్ సాయి కొడుకుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
పోలీసులు సందీప్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. అతని డ్రగ్ టెస్ట్లో నెగటివ్‌గా వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2న సందీప్‌ను స్థానిక కోర్టులో హాజరుపర్చారు. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని.. ఓ విద్యార్థి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో మరో కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొదట గాయపడిన వ్యక్తి మృతి చెందగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు.
ఈ కేసులో ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు డైరెక్టర్ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు దాటుతున్న ఒకరిని కారు ఢీకొట్టగా.. గాయపడిన వ్యక్తిని రోడ్డుకు మరోవైపు ఉన్న హాస్పిటల్‌కు కాళ్లు, చేతులు పట్టుకొని దాటిస్తుండగా సందీప్ కారు ఓవర్‌స్పీడ్‌తో వచ్చి బలంగా ఢీకొట్టింది.
దీంతో అంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మరణించగా, మరో క్యాబ్డ్రైవర్తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగాక ఆగి సాయం చేయాల్సిన సదరు నిందితుడు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
