నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు

నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు

తెలంగాణ మండిపోయింది.. సూర్యుడు భగభగతో అల్లాడిపోయారు జనం.. ఆకాశం నుంచి ఎండ కాస్తుందా లేక నిప్పులు పడుతున్నాయా అన్నట్లు వణికిపోయారు. 46.8 డిగ్రీలు ఉష్ణోగ్రతతో తెలంగాణ రాష్ట్రం రికార్డులు బద్దలు కొట్టింది. 2024, మే 4వ తేదీ శనివారం.. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా 46.8 డిగ్రీలు టెంపరేచర్ నమోదు అయ్యింది. అందుకు ఏ మాత్రం తీసిపోకుండా.. నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది.

ఉదయం 10 గంటల నుంచే మండే ఎండలతో జనం బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఇలాంటి పరిస్థితులు మే 6 వరకు కొనసాగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. ఎండల తీవ్రత ఎక్కవ ఉండటంతో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.