ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ సీజన్ UAE వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబరు 19న ప్రారంభమై… నవంబరు 10న ముగుస్తుంది. ఐపీఎల్ ప్రారంభ, ముగింపు తేదీలు తప్ప ఇప్పటికీ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. ఆగస్టు 30 నాటికి ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ తెలిపారు. ఈసారి పోటీలు భారత వెలుపల UAE లో జరగనున్నందున ఫ్రాంచైజీలు ఇంకా కుదురుకోలేదని, వేదికల పరిశీలన కూడా పూర్తి కాలేదని, అందుకే షెడ్యూల్ ఆలస్యమవుతోందని పటేల్ వివరించారు.
ప్రస్తుతం ఐపీఎల్ పాలకమండలి సభ్యులు UAE లో ఉన్నారని, టోర్నీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఐఎంజీ సంస్థ ప్రతినిధులతో కలిసి అన్ని అంశాలను ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. చివరిగా బీసీసీఐ వర్గాలు యూఏఈ అధికారులతో చర్చించాల్సి ఉంటుందని.. ఆ తర్వాత షెడ్యూల్ పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.


