దుబాయ్: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా(87: 61 బాల్స్ లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(26: 17బాల్స్ లో 4ఫోర్లు), ఆఖర్లో దినేశ్ కార్తీక్(21 నాటౌట్: 10 బాల్స్ లో 3ఫోర్లు) విజృంభించడంతో కోల్ కతా మంచి స్కోర్ చేసింది. చివర్లో ఇయాన్ మోర్గాన్(15) దూకుడుగా ఆడలేకపోయాడు.
చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా సాంట్నర్, జడేజా, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీశారు.
Innings Break!#KKR post a total of 172/5 on the board. Will #CSK chase this down?
Scorecard – https://t.co/pxx3yYaVsq #Dream11IPL pic.twitter.com/QXMxtQUY6b
— IndianPremierLeague (@IPL) October 29, 2020

