గడ్డంతో కూడా కోవిడ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. బయట ఎక్కడో ఒక దగ్గర తాకిన చేతులతో గడ్డాన్ని ముట్టుకుంటే.. వైరస్ గడ్డంలోని వెంట్రుకలకు అంటుకుని అలాగే ఉండిపోతుంది. ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చాలాసార్లు.. గడ్డం పూర్తిగా క్లీన్ అవ్వదు. దాంతో వైరస్ అక్కడే కొన్ని గంటల పాటు నిలిచి ఉండే ప్రమాదముంది. అందుకే ఈ టైంలో ఎక్కువ గడ్డం పెంచడం అంత మంచిది కాదు. ఒకవేళ పెంచితే ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేస్తూ, గడ్డాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలి.
మొబైల్ ఎక్కడ పడితే అక్కడ
చాలామంది మొబైల్‌ను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. అలాగే వాడిన తర్వాత మంచం మీదో, సోఫామీదో అలా విసిరేస్తుంటారు. ఈ అలవాటుతో కుడా ఎంతో రిస్క్ ఉంది ఎలాగంటే.. ఈ రోజుల్లో చేతులు ఎక్కువసేపు అంటుకుని ఉండేది మొబైల్స్‌నే. చేతులతో దేన్ని ముట్టుకున్నా ఆ తర్వాత వెంటనే చేత్తో పట్టుకునేది మొబైలే. అలాగే మొబైల్‌ను శానిటైజ్ చేయడం కూడా చాలా తక్కువ. దాంతో అంతో ఇంతో రిస్క్ ఫ్యాక్టర్ మొబైల్ రూపంలో పొంచి ఉంటుంది. అలాంటి మొబైల్‌ను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల వైరస్‌ను అన్ని సర్ఫేస్‌లకు అంటించినట్టవుతుంది. అందుకే మొబైల్‌ను దగ్గర ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం అవసరం.
సపోర్ట్ తీసుకోవడం
లిఫ్ట్‌లో నిల్చున్నప్పుడు, బస్, ట్రైన్స్ ఎక్కినప్పుడు లేదా ఎక్కడైనా గోడ పక్కన నిల్చున్నప్పడు తెలియకుండానే చాలామంది సపోర్ట్ తీసుకుని నిలబడతారు. అలా పక్కన ఉన్న గోడ, కుర్చీ లేదా సపోర్టింగ్ రాడ్స్‌కు ఆనుకోవడం వల్ల బట్టలకు వైరస్ అంటుకునే ప్రమాదముంది. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా.. చుట్టూ ఆరడుగుల వరకూ ఎలాంటి సర్ఫేస్ లేదా మనుషులు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆనుకుని నిల్చొనే అలవాటును మార్చుకోవాలి.
స్నానానికి బద్ధకించడం
బయటకు వెళ్లే పని లేనప్పుడు , సెలవు రోజుల్లో చాలామంది స్నానానికి బద్ధకిస్తుంటారు. స్నానం చేయకపోవడం.. చాలా రిస్క్‌ను తెచ్చిపెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన ఒంటి మీదో లేదా బట్టల మీదో వైరస్ ఉండి ఉంటే.. స్నానం చేస్తే పోతుంది. అలా కాకుండా బద్ధకిస్తే.. వైరస్‌తో పాటు మరికొన్ని ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదముంటుంది.
గోళ్లు కొరకడం
గోళ్లు కొరకడం చాలా బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసిందే. అందుకే ఈ టైంలో ఆ అలవాటుని వెంటనే మానుకోవాలి. చేతులమీద కన్నా.. చేతి వేళ్లపై, వేళ్ల గోర్ల మధ్యలో వైరస్ ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండే ప్రమాదముంది. అలాంటప్పుడు తరచూ చేతివేళ్లు కొరుకుతూ ఉంటే వైరస్ నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే గోళ్లు కొరికే హ్యాబిట్‌ను మానుకోవాలి.
గ్లోవ్స్ తప్పుగా పెట్టుకోవడం
ఒక్కోసారి సరిగ్గా జాగ్రత్తలు పాటించకపోవడం కూడా అజాగ్రత్త కిందకే వస్తుంది. వైరస్ రాకుండా మాస్క్, గ్లోవ్స్ ధరించడం మంచి పనే. కానీ వాటిని పెట్టుకోవడంలో పర్ఫెక్షన్ మిస్ అయితే ఎలాంటి లాభం ఉండదు. ముఖ్యంగా గ్లోవ్స్ తొడుక్కునే వాళ్లు, గ్లోవ్స్ ముందు భాగానికి చేతులు అంటకుండా జాగ్రత్తగా తొడుక్కోవాలి. ఒక వేళ చేతులతో గ్లోవ్స్‌ను అంటుకోవాల్సి వస్తే.. గ్లోవ్స్ పెట్టుకున్న తర్వాత వెంటనే స్పిరిట్ లేదా శానిటైజర్‌తో గ్లోవ్స్ ఉన్న చేతుల్ని క్లీన్ చేసుకోవాలి.
ఇవి కూడా
కళ్లు నలుపుకోవడం, ముక్కు, నోటిని చేతులతో తాకడం లాంటి అలవాట్లు చాలా డేంజర్. వీటితో పాటు కుర్చీ, సోఫా లేదా మంచంపై కూర్చున్నప్పుడు కాళ్లు పైన పెట్టడం వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కాళ్లను చేతులను ఎక్కడ పెడుతున్నాం. అనే విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి.
