ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ లను రద్దు చేసే వరకు పోరాడుతాం: కవిత 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ లను రద్దు చేసే వరకు పోరాడుతాం: కవిత 

హైదరాబాద్ లోని ధర్నా చౌక్ దగ్గర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఆందోళన చేపట్టారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన నిబడిన నాయకులను చూస్తే మరొక తెలంగాణ ఉద్యమంలా అనిపిస్తుందని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ లను రద్దు చేసే వరకు పోరాడుతామని అన్నారు కవిత.

గత ప్రభుత్వంలో ఫారెస్ట్ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేసిన చాలా మందికి అన్యాయం జరిగిందని...గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం పట్ల నన్ను క్షమించాలని... ఆ ప్రభుత్వంలో పాపం నాకు ఉందని అన్నారు కవిత. వెంటబడి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, డిక్లేర్ చేసి పోరాడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తివేస్తే ఈ ప్రభుత్వం ధర్నాలు చేసుకొని చావండి అని వదిలేస్తుందని అన్నారు కవిత.

మిలియన్ మార్చ్ తో తెలంగాణ వచ్చిందని.. హాఫ్ మిలియన్ మార్చ్ చేస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమావుతాయని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల తెలంగాణ జాగృతి కలిసి నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 900 మంది ఏజెన్సీ లకు ప్రభుత్వం డబ్బు పోతుందని...ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ లను రద్దు చేసే వరకు పోరాడుతామని అన్నారు కవిత.

మహిళలకు మెటర్నటి లీవ్స్ విషయంలో అన్యాయం జరుగుతుందని... రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి రాజకీయా పార్టీగా రాబోతుందని అన్నారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి లేకుంటే పోరాటంలో జాగృతి వారికి అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం ప్రారంభమైందని.. ఇటీవల ఖమ్మం బాధితుల పట్ల చేసిన పోరాటంలో న్యాయం జరిగేలా ప్రభుత్వం దిగి వచ్చేలా చేసామని అన్నారు కవిత. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అందరితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు కవిత.