V6 News

@300.. అరుదైన ఘనత అందుకున్న ఇషాంత్‌‌‌‌ శర్మ

@300.. అరుదైన ఘనత అందుకున్న ఇషాంత్‌‌‌‌ శర్మ

చెన్నై: ఇంగ్లండ్‌‌‌‌తో జరుగుతున్న ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో టీమిండియా పేసర్‌‌‌‌ ఇషాంత్‌‌‌‌ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇండియా తరఫున టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో 300 వికెట్లు తీసిన థర్డ్‌‌‌‌ పేస్‌‌‌‌ పేసర్​గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌‌‌గా ఆరో ఇండియన్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో డాన్‌‌‌‌ లారెన్స్‌‌‌‌ వికెట్‌‌‌‌ తీయడంతో లంబూ 98 మ్యాచ్‌‌‌‌ల్లో ఈ ఫీట్‌‌‌‌ను సాధించాడు. అనిల్‌‌‌‌ కుంబ్లే (619), కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ (434), హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (417), అశ్విన్‌‌‌‌ ( ఈ మ్యాచ్‌‌‌‌తో కలిపి 386), జహీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (311), ఇషాంత్‌‌‌‌ (300) కంటే ముందున్నారు. ఇప్పటివరకు ఇషాంత్‌‌‌‌ 11సార్లు ఐదు వికెట్ల హాల్‌‌‌‌ సాధించాడు. ఒకసారి 10 వికెట్లు తీశాడు. అయితే వేగంగా 300 వికెట్లు తీసిన లిస్ట్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ (54 మ్యాచ్‌‌‌‌లు) ముందుండగా, అనిల్​ కుంబ్లే (66), హర్భజన్‌‌‌‌  సింగ్​ (72), కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ జహీర్‌ ఖాన్ (89) తర్వాతి స్థానాల్లో  కొనసాగుతున్నారు.