దారుణం : 16 ఏళ్ల బాలిక‌పై 30మంది గ్యాంగ్ రేప్..అంతా 20ఏళ్ల లోపువారే

దారుణం : 16 ఏళ్ల బాలిక‌పై 30మంది గ్యాంగ్ రేప్..అంతా 20ఏళ్ల లోపువారే

ఓ రిసార్ట్‌లో దారుణం జ‌రిగింది. 16ఏళ్ల బాలిక‌పై 30మంది పురుషులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. . గ్యాంగ్ రేపుపై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు రేకెత్తుతున్నాయి.

ఇజ్రాయిల్ దేశం ఐలాలోని రెడ్ సీ రిసార్ట్ లో బాధితురాలిపై 20ఏళ్ల లోపు వ‌య‌సున్న 30మంది యువ‌కులు దారుణానికి పాల్ప‌డ్డారు. స‌మాచారం ఆలస్యంగా వెలుగులోకి రావ‌డంతో నిందితుల్ని క‌ఠినంగా శిక్షించాలంటూ ఆదేశంలో ఆందోళ‌న కారులు ఆందోళ‌న చేప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ అధికారి మిక్కీ మాట్లాడుతూ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు నిందితుల్ని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే టెల్ అవీవ్, జెరూసలేం వంటి పెద్ద నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల్ని అరిక‌ట్టాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ ఆందోళ‌న‌పై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఇది ఒక యువతిపై చేసిన నేరం మాత్రమే కాదు. ఇది మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరం. ఇది మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. త‌క్ష‌ణ‌మే నిందితుల్ని విచార‌ణ‌కు హాజ‌రుప‌ర్చాల‌ని ఆదేశించారు.