కరోనా రూల్స్ సరిగా లేవు
సినిమా, టీవీ షూటింగులకు 65 ఏళ్ల పైబడిన నటీనటులు, టెక్నీషియన్లను అనుమతించక పోవడం సరికాదని ప్రముఖ నటులు పరేష్ రావల్, షబానా ఆజ్మీ అన్నారు. కరోనా కారణంగా సినిమా, టీవీ షూటింగ్‌లకు ప్రభుత్వాలు పరిమితులు, కఠినమైన రూల్స్ తో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన నటీనటులు, టెక్నీషియన్లను అనుమతించ కూడదనే నిబంధన ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రూల్ పాస్ చేసింది. అయితే ఇలా సీనియర్లను షూటింగ్‌కు అనుమతించకపోవడం కరెక్ట్ కాదంటున్నారు సీనియర్ యాక్టర్స్. దీంతో షూటింగ్స్ మొదలైనా చాలా మంది సీనియర్స్ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలా సినిమాలు, టీవీ షోస్ పూర్తయ్యేందుకు సీనియర్స్ అవసరం ఎంతో ఉందని, ఈ రూల్‌ను ఎత్తేయాలని షబానా ఆజ్మీ, పరేష్ రావల్, హేమా మాలిని వంటి యాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది సీనియర్స్ కరోనా బారిన పడ్డ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
