గ్యాంగ్ స్టర్ దుబే కేసు లీక్ ఇచ్చింది నిజమే

గ్యాంగ్ స్టర్ దుబే కేసు లీక్ ఇచ్చింది నిజమే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గాంధీ ఫ్యామిలీకి చెందిన రాజీవ్గాంధీ ఫౌండేషన్ సహా మూడు ట్రస్టుల్లో అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర హోం శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. రాజీవ్గాంధీ ఫౌండేషన్, రాజీవ్గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ల్లో లీగల్ ప్రావిజన్ల ఉల్లంఘనలు, అక్రమాలకు సంబంధించిన విచారణను ఈ కమిటీ కోఆర్డినేట్ చేస్తుందని బుధవారం ఒక ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి ఆధ్వర్యం వహిస్తారు. వివిధ శాఖలకు చెందిన ఏజెన్సీలన్నీ ఈ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీలో భాగస్వాములుగా ఉంటాయి.

అక్రమాలపై దర్యాప్తు

మనీలాండరింగ్, ఇన్కం ట్యాక్స్ ఫైలింగ్, డిక్లరేషన్లో అవకతవకలు, ఫారిన్ కంట్రీస్ నుంచి డొనేషన్లు, కంట్రిబ్యూషన్గా వచ్చిన నిధులు మొదలైన అంశాలకు సంబంధించి ఈ కమిటీ విచారణ జరుపుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను సీబీఐ, పీఎంఎల్ఏ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ఈడీ, పన్ను ఎగవేత, నిధుల మళ్లింపునకు సంబంధించిన అంశాలను ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ఏమిటీ ట్రస్టులు

అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం.. రాజీవ్గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్) 1991 జూన్ 21న ఏర్పాటైంది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఆశయాలకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్కు సోనియాగాంధీ చైర్మన్గా ఉన్నారు. మన్మోహన్సింగ్, పి.చిదంబరం, మాంటెక్సింగ్ అహ్లూవాలియా, సుమన్దూబే, రాహుల్గాంధీ, అశోక్ గంగూలీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఇందులో ట్రస్టీలుగా ఉన్నారు. రాజీవ్గాంధీ చారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ) అనేది ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీనిని 2002లో ఏర్పాటు చేశారు. దేశంలోని పేదలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారి అవసరాలను తీర్చేందుకు ఇది ఏర్పాటైంది. సోనియాగాంధీ, రాహుల్గాంధీ మరికొందరితో కలిసి దీనికి ట్రస్టీలుగా ఉన్నారు.

బీజేపీ ఆరోపణలు

2005 నుంచి 2009 మధ్య రాజీవ్గాంధీ ఫౌండేషన్కి చైనా నుంచి డొనేషన్లు వచ్చాయని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గత నెలలో ఆరోపించారు. 2005 నుంచి 2009 వరకూ చైనా ఎంబసీ నుంచి ప్రతి ఏడాది ఆర్జీఎఫ్కు డొనేషన్లు అందాయని చెప్పారు. 2006 నుంచి 2009 వరకూ హవాలా మార్గంలో ట్యాక్స్ హెవెన్గా భావించే లాక్సెంబర్గ్ నుంచి కూడా డొనేషన్లు అందాయని విమర్శించారు.

రాజకీయ కక్షే

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. చైనా ఎంబసీ నుంచి వచ్చిన డొనేషన్లను దివ్యాంగుల సంక్షేమం కోసం వాడామని, పీఎంఆర్ఎఫ్ గ్రాంట్ను సునామీ రిలీఫ్ వర్క్ కోసం ఉపయోగించామని క్లారిటీ ఇచ్చింది. ఆర్జీఎఫ్కు చైనా ఎంబసీ నుంచి వచ్చిన రూ.1.45 కోట్లను దివ్యాంగుల సంక్షేమం కోసం, ఇండో చైనా రిలేషన్స్పై రీసెర్చ్ కోసం ఉపయోగించినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా క్లారిటీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటును రాజకీయ ప్రేరేపిత చర్యగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రియాంకాగాంధీకి ప్రభుత్వ బంగ్లాను క్యాన్సిల్ చేయడం.. నేషనల్ హెరాల్డ్ కేసు.. మొదలైన చర్యలతో కక్ష సాధిస్తోందని విమర్శించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం