చెత్తవాగుడు ఆపు.. మంజ్రేకర్ కు జడేజా వార్నింగ్

చెత్తవాగుడు ఆపు.. మంజ్రేకర్ కు జడేజా వార్నింగ్

మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ … రవీంద్ర జడేజాను ఉద్దేశించిన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. చాహల్, కులదీప్ యాదవ్ లకు బదులుగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న రవీంద్రజడేజాను టీమ్ లోకి తీసుకుని ఉంటే ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఇండియా పరిస్థితి మరోలా ఉండేదా అని ఓ ఇంటర్వ్యూలో..  సంజయ్ మంజ్రేకర్ ను ప్రశ్నించారు. దానికి మంజ్రేకర్ ఇచ్చిన ఆన్సర్ కాంట్రవర్సీ అయింది. ఐతే.. ఓ బ్యాట్స్ మన్ , లేదా ఓ బౌలర్ ను తీసుకోవడమే కరెక్ట్.. అంతేకానీ.. అటు బౌలర్, ఇటు బ్యాట్స్ మన్ కాని జడేజాలాంటి చిన్న ప్లేయర్ల అవసరం ఉండదని మంజ్రేకర్ అన్నాడు. జడేజా టెస్టుల్లో మాత్రమే బౌలర్ గా పనికొస్తాడని… లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ లో తాను అతడికి పెద్ద ఫ్యాన్ ఏమీ కాదన్నాడు.

మంజ్రేకర్ కామెంట్స్ పై ట్విట్టర్ లో డైరెక్టుగా రవీంద్ర జడేజానే స్పందించాడు. సంజయ్ మంజ్రేకర్ ఆడిన మ్యాచ్ లకన్నా ఇప్పటికే తాను డబుల్ మ్యాచ్ లు ఆడానని చెప్పాడు రవీంద్ర జడేజా. ఇంకా క్రికెట్ ఆడుతున్నానని గుర్తుచేశాడు. “ఏదైనా సాధించిన వారికి గౌరవించడం నేర్చుకో. నీ వాగుడు గురించి నాకు బాగా తెలుసు” అంటూ ఘాటుగా స్పందించాడు రవీంద్ర జడేజా.