జలమండలి ఎన్నికల్లో మొగుళ్ల రాజిరెడ్డి విజయం.. 717 ఓట్ల మెజారిటీతో గెలుపు

జలమండలి ఎన్నికల్లో మొగుళ్ల రాజిరెడ్డి విజయం..    717 ఓట్ల మెజారిటీతో గెలుపు

సైఫాబాద్, వెలుగు: జలమండలిలో గుర్తింపు కార్మిక సంఘం హోదా కోసం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌  అనుబంధ ఐఎన్‌‌‌‌టీయూసీకి చెందిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్ ఘన విజయం సాధించింది. యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. 

ఐఎన్‌‌‌‌టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్, బీఆర్‌‌‌‌టీయూ అనుబంధ హెచ్‌‌‌‌ఎండబ్ల్యూఎస్‌‌‌‌ఎస్‌‌‌‌బీ కామ్‌‌‌‌ యూనియన్‌‌‌‌లు పోటీపడ్డాయి. 2,900 మంది ఓటర్లు ఉండగా, 2,761 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 2,722 ఓట్లు చెల్లుబాటు కాగా, 39 ఓట్లు చెల్లనివిగా తేలాయి.

 రాంబాబు యాదవ్‌‌‌‌కు 983 ఓట్లు రాగా, మొగుళ్ల రాజిరెడ్డికి 1,700 ఓట్లు వచ్చాయి. 717 ఓట్ల భారీ మెజారిటీతో రాజిరెడ్డి విజయం సాధించారు. ఈ విజయంతో ఐఎన్‌‌‌‌టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్ గుర్తింపు సంఘం హోదాను దక్కించుకుంది.