న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని అన్నాడీఎంకే ఎంపీ ఎం. ధనపాల్ డిమాండ్ చేశారు. ఆమెను సంక్షేమ పథకాల తల్లిగా అభివర్ణించారు. సోమవారం రాజ్యసభ జీవో అవర్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జయలలిత అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యం, రాజకీయ ధైర్యం కలిగిన అసాధారణ నాయకురాలని ప్రశంసించారు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, విద్యార్థులకు సైకిళ్లు, మిక్సీలు, ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు, గ్రైండర్ల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టార ని గుర్తు చేశారు. భారత రత్న ఇవ్వడమే జయలలితకు అసలైన నివాళి అన్నారు.
