ఇరాన్ తో శాంతి చర్చల్లో భాగంగా అమెరికా వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్ శుక్రవారం (2026 ఏప్రిల్ 10) పాకిస్తాన్ బయల్దేరారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ రవాణా ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తున్న వైస్ ప్రసిడెంట్ నూర్ ఖాన్ బేస్ కు చేరుకుంటారు. యుద్ధానికి ఒక ముగింపు వస్తుందేమోనన్న ఆశాభావంతో ఉన్నట్లు బయల్దేరే ముందు వాన్స్ తెలిపారు.
ప్రసిడెంట్ ట్రంప్ చెప్పినట్లు.. ఇరాన్ శాంతి చర్చలకు వస్తే మేము వాళ్లకు స్నేహ హస్తం ఇస్తాం. ఒకవేళ మాతో గేమ్స్ ఆడుకోవాలని చూస్తే చర్చలంటూ ఏమీ ఉండవు. ఇరాన్ కు ఎలా బుద్ధి చెప్పాలా అలా చెబుతాం.. అని అన్నారు.
ఇస్లామాబాద్ లో జరగున్న చర్చలలో అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల తర్వాత కీలకంగా మారనున్నాయి. ఈ విషయంలో ప్రసిడెంట్ ట్రంప్.. క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారని.. ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుందన్నారు.
►ALSO READ | అమెరికాను డోంట్ కేర్ అంటున్న ఇజ్రాయెల్ : లెబనాన్ పై కంటిన్యూగా దాడులు
ఇక చర్చల్లో భాగంగా ఇరాన్ కూడా పాకిస్తాన్ కు రావాల్సి ఉంది. అయితే ఆలస్యంగా శుక్రవారం రాత్రికి ఇరాన్ బృందం ఇస్లామాబాద్ చేరుకోనుంది. శనివారం (ఏప్రిల్ 11) ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొననున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గలిబా చర్చల్లో కీలక పాత్ర పోషించనున్నారు.
ఇస్లామాబాద్ లోని సెరెనా హోటల్ లో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పాక్ అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ.. హోటల్ ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా.. చర్చలు అక్కడే జరగనున్నట్లు చెబుతున్నారు.
