జీడిమెట్ల, వెలుగు: ఓ ఫ్యాక్టరీలో మెషినరీ కార్మికులపై పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పేట్బషీరాబాద్పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌లో సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్పేరుతో ప్యానల్ఉత్పత్తుల కంపెనీ నిర్వహిస్తున్నారు.
గురువారం ఈ ఫ్యాక్టరీకి కొత్త యంత్రాలు వచ్చాయి. వాటిని కార్మికులు సాయి, శివం తిరుపతిరెడ్డి, లింగాల పవన్‌కుమార్ దించుతున్నారు. ఆ సమయంలో మెషినరీ మీద పడటంతో సాయి అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్ డ్రైవర్ దీపక్, యజమానులు సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి భద్రతాచర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
