రాహుల్ గాంధీతో పాస్టర్ పొన్నయ్య భేటీ

రాహుల్ గాంధీతో పాస్టర్ పొన్నయ్య భేటీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నాలుగో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన కన్యాకుమారిలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తమిళ క్రైస్తవ పాస్టర్ జార్జ్ పొన్నయ్య, రాహుల్ గాంధీని కలిశారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు పొన్నయ్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జీసస్ క్రీస్తు.. నిజమైన దేవుని రూపమని అంటారు కదా.. ఇది నిజమేనా అన్న రాహుల్ గాంధీ ప్రశ్నకు.... జీసస్ నిజమైన దేవుడని పొన్నయ్య సమాధానమిచ్చారు. దేవుని రూపంలో ఆయన అవతరించారని, ఆయనే నిజమైన దేవుడని చెప్పారు. కానీ శక్తి అలా కాదని... అందులో కేవలం మానవ రూపాన్ని మాత్రమే మనం చూస్తామని తెలిపారు. దీంతో పొన్నయ్య ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

https://twitter.com/ani_digital/status/156848263572242432

పాస్టర్ పొన్నయ్య ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలోనూ ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా, డీఎంకే మంత్రులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో జులైలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.