లెండర్ల చేతుల్లోకి జెట్: గోయల్ ఔట్

లెండర్ల చేతుల్లోకి జెట్: గోయల్ ఔట్

ఇండియా ప్రైవేట్ రంగంలోకి తోలి విమానయాన సంస్థ అయిన జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌లో సోమవారం కీలక మార్పు లు జరిగాయి. సంస్థను గట్టెక్కిం చడానికి పలు నిర్ణయాలను ప్రకటించారు.అప్పుల కుప్పగా మారిన ఈ కంపెనీ వ్యవస్థాపకుడు నరేశ్‌ గో యల్‌‌ చైర్మన్‌‌ పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన భార్య అనితా గో యల్‌‌ కూడా కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. జెట్‌‌కు అప్పులు ఇచ్చిన ఎస్‌‌బీఐ నేతృత్వంలో ని బ్యాంకుల కన్సార్ షియం (లెండర్లు) చేతుల్లోకి కంపెనీ వెళ్లిపోయింది. గో యల్‌‌ వాటా 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గడంతో లెండర్ల వాటా 50 శాతానికిపైగా పెరిగింది. బ్యాంకుల అప్పులకుగాను 1.4 కోట్ల షేర్లను జారీ చేశారు.కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్‌‌ను వెతికేందుకు లెండర్లు త్వరలోనే వేలంపాట నిర్వహించనున్నారు. కంపెనీ ఆస్తులను తనఖా పెట్టుకొని మరో రూ.1,500 కోట్లు ఇస్తారని జెట్‌‌ బాంబే స్టా క్‌ ఎక్స్‌‌చేంజ్‌ కు తెలిపింది. లీజు బకాయిలు, జీతాలు, అప్పుల బకాయిలు చెల్లించడంలో గత కొన్ని నె లలుగా జెట్‌‌ ఎయిర్వేస్‌‌ విఫలమవుతున్న సంగతి తెలిసిందే.

లెండర్ల ఒత్తిడి మేరకే…

దాదాపు 25ఏళ్ల క్రితం 1993లో గో యల్‌‌ తన భార్య అనితాతో కలిసి దీ నిని ఏర్పాటు చేశారు.లీజు బకాయిలు కట్టకపోవడంతో పదుల సంఖ్యలో విమానాలు మూలనపడుతుండటంతో అప్రమతంమైన ఎస్‌‌బీఐ గో యల్‌‌తోపాటు ముగ్గురు డైరెక్టర్ లు రాజీనామా చేయాలని కొన్ని రోజుల క్రితమే ఒత్తిడి తెచ్చింది. కొత్తగా అప్పులను ఇవ్వడానికి ఒప్పుకున్నా,జెట్‌‌లోని ఎతిహాద్‌ ఎయిర్‌‌లైన్స్‌‌ 24 శాతం వాటాను కొనడానికి మాత్రం తి రస్కరించిం ది. కంపెనీ మూతపడకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎస్‌‌బీఐ చైర్మన్‌‌ రజనీశ్‌ కుమార్‌‌ ప్రకటించారు. మూడు నె లల నుంచి తమకు జీతాలు చెల్లిం చడం లేదని జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఇంజనీర్లు, ఇతర సి బ్బంది, పైలట్లు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్‌‌ఒకటో తేదీ లోపు పెండింగ్ ‌ వేతన బకాయిలను పరిష్కరిం చకపోతే అదే రోజు నుంచి సేవలు నిలిపివేస్తామని పైలట్లు హెచ్చరించారు.

ఫలించని గోయల్‌ ప్రయత్నాలు…

జెట్‌‌ చైర్మన్‌‌గా కొనసాగడానికి నరేశ్‌ గో యల్‌‌ అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా వినని లెండర్లు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. జెట్‌‌లో కీలకంగా వ్యవహరించిన గో యల్‌‌ సన్నిహితుడు నికోస్ కర్దాసిస్‌‌ గత ఏడాది డిసెంబరులో  వైదొలిగాక కంపెనీకి మరిన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. జెట్‌‌లాగే కింగ్‌‌ఫిషర్‌‌, స్పైస్‌‌జెట్‌‌లకూ సమస్యలు వచ్చాయి. కింగ్‌‌ఫిషర్‌‌ దివాలా తీసినా కొత్త యజమాని కారణంగా స్పైస్‌‌జెట్‌‌ కష్టాల నుంచి బయటపడింది.

జెట్‌‌ ఎయిర్‌‌వేస్ సంక్షోభంలో చిక్కుకోవడానికి ముఖ్యకారణం దీ ని ప్రత్యర్థులు స్పైస్‌‌జెట్‌‌,ఇండిగోలు ధరల యుద్ధానికి తెరతీయడమే కారణమని ఈ రంగంలోని నిపుణులు చెబుతుంటారు. ఈ రెండు కంపెనీలు చవక ధరలను కొనసాగించడానికి మొగ్గుచూపుతున్నాయి. జెట్‌‌ నిలబడాలంటే మరిన్ని నిధులను తెచ్చుకోవడం మినహా వేరే మార్గం లేదు. భవిష్యత్‌ లోనూ మరిన్ని నష్టా లకూ అవకాశాలు ఉన్నాయి. కొత్తగా నిధుల సేకరణ, యా జమాన్యం చేతులు మారడం వంటివి కంపెనీ భవితవ్యాన్ని నిర్దేశి స్తాయి. ప్రభుత్వం కూడాజెట్‌‌ను నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. మూలనపడ్డ కొన్ని విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్‌‌జెట్‌‌ను కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో జెట్‌‌ ఎయిర్ వేస్ షేర్లు 15 శాతానికి పైగా లాభంతో ముగియడం విశేషం.