V6 News

నెక్సస్‌‌ మాల్స్లో జ్యువెలరీ జోన్లు

నెక్సస్‌‌ మాల్స్లో  జ్యువెలరీ జోన్లు

హైదరాబాద్​, వెలుగు: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ జయేన్ నాయక్ తెలిపారు.  బంగారం ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ఉత్సాహం తగ్గలేదని తెలిపారు. 

వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నెక్సస్ సెలెక్ట్ మాల్స్‌‌‌‌లో ప్రత్యేక జ్యువెలరీ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉండటమే కాకుండా కొనుగోలుదారులకు ప్రత్యేక బహుమతులు, లాయల్టీ రివార్డులు కూడా అందిస్తున్నాయని తెలిపారు. నెక్సస్ వన్ యాప్ ద్వారా బిల్లులను అప్‌‌‌‌లోడ్ చేసి ఈ ప్రయోజనాలను పొందవచ్చని నాయక్ ​పేర్కొన్నారు.