రోడ్డు పక్కన పానీపూరీ తిన్నారు.. ఆస్పత్రిలో చేరిన 50 మంది

రోడ్డు పక్కన పానీపూరీ తిన్నారు.. ఆస్పత్రిలో చేరిన 50 మంది

పానీ పూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 50 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్‌ స్టాల్‌లో పానీపూరి తిన్న 50 మంది మహిళలు, చిన్న పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో వెలుగు చూసింది. 

Also Read : దసరా పండుగ: బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు

జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ప్రాంతంలోని  రోడ్డు పక్కన  దుకాణంలో పానీ పూరీ తిన్న 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరీ తిన్నవారంతా అతిసార ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. పానీపూరీ తిన్నవారంతా క‌డుపు నొప్పి, వాంతులు, విరోచ‌నాలతో ఇబ్బంది పడుతున్నారు.  అక్టోబర్ 20 సాయంత్రం లోకై పంచాయితీ పరిధిలోని గోల్ గప్పా తిన్న 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతలో బాధపడుతున్నారని కోడెర్మా అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ACMO) తెలిపారు.  కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతోకోడెర్మాలోని సదర్ ఆసుపత్రికి తరలించామన్నారు.  ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ACMO తెలిపారు.  కొంతమంది ఆరోగ్ పరిస్థితి నిలకడగా ఉందంటూ...  వారు పానీపూరి తిన్న దుకాణంలోని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని ల్యాబ్ టెస్ట్ ల కోసం రాంచీకి పంపామని ACMO చెప్పారు.