జార్ఖండ్ బీజేపీ మహిళా నేత సీమా పాత్ర అరెస్ట్

జార్ఖండ్ బీజేపీ మహిళా నేత సీమా పాత్ర అరెస్ట్

తన ఇంట్లో పనిచేసే ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన  మహిళా నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న సునీత అనే మహిళను చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీమాను కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు అధికారులు తరలిస్తామన్నారు.

సునీత ఆరోపణలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ వెంటనే కేసు నమోదు చేయాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ పారదర్శకంగా చేపట్టాలని తెలిపింది.  దీంతో పోలీసులు సీమా కోసం గాలింపు చేపట్టింది. అయితే విషయం తెలుసుకున్న సీమా పరారైంది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు రోడ్డుపై నుంచి పరుగెడుతున్న సీమాను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీతను జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరండి పరామర్శించారు.

సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెను అరెస్టు చేయాలని కోరుతూ పలువురు డిమాండ్ చేశారు. ఇక సీమా పాత్రా బీజేపీ మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్ పాత్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అయితే పని మనిషికి సంబంధించిన ఓ వీడియై వైరల్ కావడంతో.. ఇటీవలే ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.