అమెరికాకు 46వ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బిడెన్‌కు స్పీచ్ రైటర్‌గా భారత సంతతికి చెందిన వినయ్ రెడ్డి ఎన్నికయ్యారు. కాబోయే కొత్త అధ్యక్షుడు బిడెన్ నేడు చదవబోయే స్పీచ్ కూడా వినయ్ రెడ్డి రాసిందే కావడం గమనార్హం. వినయ్ రెడ్డి గతంలో కూడా బిడెన్‌కు స్పీచ్ రైటర్‌గా పనిచేశారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో బిడెన్‌కు సీనియర్ సలహాదారునిగా పనిచేశారు. అంతేకాకుండా..
బిడెన్ 2013-2017 వరకు రెండోసారి యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలో వినయ్ రెడ్డి బిడెన్ దగ్గర పనిచేశారు. ఇప్పుడు తాజాగా కాబోయే అధ్యక్షుడు బిడెన్‌కు స్పీచ్ రైటర్‌గా నియమితులయ్యారు. కాగా.. ఒక అధ్యక్షుడికి స్పీచ్ రైటర్‌గా నియమించబడిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా వినయ్ రెడ్డి రికార్డుకెక్కారు.
చొల్లేటి వినయ్ రెడ్డిది కరీంనగర్ జిల్లాలోని పోతిరెడ్డిపేట. ఆయన తండ్రి నారాయణ రెడ్డి 1970లో అమెరికా వెళ్లి డాక్టర్‌గా స్థిరపడ్డారు. అమెరికాలోని ఓహియా రాష్ట్రంలోని డేటన్‌లో పుట్టిపెరిగిన వినయ్ రెడ్డి అక్కడే కేజీ నుంచి పీజీ వరకు చదువుకున్నారు. మియామీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు.
For More News..
ఇంటి ముందున్న చెట్టు నరికిన యజమానికి భారీ ఫైన్..
వాహనాల మీద పడ్డ బండరాళ్ల ట్రక్కు.. 13 మంది మృతి
పెట్రోల్ ధర పైపైకి.. రాజధానిలో ఆల్ టైం హై మార్క్..
