యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ సక్సెస్ అయింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసింది. వైద్యులు ఆర్.ఎ పూర్ణచంద్ర తేజస్వి, నితిన్ బెజ్జంకి, మధుసూధన్ రావు సురపనేని టీమ్ తో బుధవారం ( 12, ఆగస్టు 2026) సర్జరీ చేసినట్లు వెల్లడించింది.. ఎన్టీఆర్ కోలుకోవడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ బాగానే ఉందని , అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. తారక్ అభిమానుల్లో ఒకవైపు ఆందోళన కనిపిస్తుండగా.. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..
ALSO READ : సూర్య కాళ్లకు నమస్కరించిన వెంకీ అట్లూరీ..
ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్' ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఇటీవల జిమ్ లో కసరత్తు చేస్తుండగా తారక్ భుజానికి గాయమైంది. దీంతో కొంతకాలంగా సినిమా షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బుధవారం ఎన్టీఆర్ భుజానికి ఆర్థోస్కోపిక్ సర్జరీ చేశారు.
మరో వైపు తన భుజానికి సర్జరీ సక్సెస్ అయిందని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.. తాను త్వరగా కోలుకోవాలని ఆకాక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను క్షేమంగా ఉన్నా.. మీ అందరి మద్దతే నాకు ప్రతి రోజూ శక్తి నిస్తుంది. కిమ్స్ వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు .. త్వరలోనే కలుద్దాం అంటూ తారక్ పోస్ట్ చేశారు.
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
— Jr NTR (@tarak9999) August 12, 2026
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon!…
ఎన్టీఆర్ కు గాయంతో 'డ్రాగన్' మూవీ షూటింగ్ షెడ్యూల్ పై ప్రభావం పడింది. మరో మూడు నెలల పాటు తారక్ తో షూటింగ్ లేనట్లే. అయితే నటుడి ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని, వైద్యుల సూచనల మేరకే తదుపరి షూటింగ్ నిర్ణయాలు ఉంటాయని మేకర్స్ నిర్ణయించారు. ఈలోపు మిగతా నటీనటుల షూటింగ్ షెడ్యూల్స్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. .
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ లుగర్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1967 నేపథ్యంలోని ఓ క్రైమ్-యాక్షన్ ప్రపంచాన్ని గ్లింప్స్ పరిచయం చేసింది. ఈ సినిమా 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
