కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ( ఆగస్టు 11, 2026 ) హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఊహించని సీన్ చోటుచేసుకుంది. హీరో సూర్య మాట్లాడుతున్న సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్టేజ్ పై సూర్యను మాటల్లో పెట్టిన వెంకీ.. ఒక్కసారిగా ఆయన పాదాలను తాకి నమస్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సూర్య కూడా వెంటనే వెంకీని సున్నితంగా మందలించే ప్రయత్నం చేయడం ఈ ఘటనను మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగల వైరల్ అవుతుంది. హీరోపై దర్శకుడికి ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనమంటూ అభిమానులు వెంకీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాను 20 ఏళ్లుగా సూర్యకు వీరాభిమానినని చెప్పిన వెంకీ.. ఇప్పుడు తన అభిమాన హీరోనే డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సూర్య గొప్ప నటుడే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ వంద శాతం సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Beautiful moment yesterday at #VishwanathAndSons Pre release event.
— H A N U (@HanuNews) August 12, 2026
Director #VenkyAtluri and Hero @Suriya_offl bonding 👌❤️🔥 pic.twitter.com/GBehcYxEuy
నిర్మాత నాగవంశీ, వెంకీ అట్లూరీ వల్లే ఇలాంటి ప్రత్యేకమైన సినిమా సాధ్యమైందన్నారు హీరో సూర్య. 'గజినీ'లో తనను సంజయ్ రామస్వామిగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి ఆ మ్యాజిక్‌ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని, హైదరాబాద్‌లో గడిపిన ఆరు నెలలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ALSO READ : అయ్యో టైటిల్ చెప్పేశానా.. మెగాస్టార్ 158 మూవీ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి!
ఇక ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య సరసన మమితా బైజు నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, స్పోర్ట్స్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
