ఒక్క టీజర్‌‌తో నిరాశ, నిస్పృహ పటాపంచలయ్యాయ్.. ఆర్ఆర్ఆర్‌‌పై సెలబ్రిటీస్ ప్రశంసలు

ఒక్క టీజర్‌‌తో నిరాశ, నిస్పృహ పటాపంచలయ్యాయ్.. ఆర్ఆర్ఆర్‌‌పై సెలబ్రిటీస్ ప్రశంసలు

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం‌‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌‌ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ రోల్‌‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించనుండటం సినిమాకు విపరీతమైన క్రేజ్‌‌ను తెచ్చిపెట్టింది. తాజాగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌‌ను రామరాజు ఫర్ భీమ్ పేరుతో గురువారం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ టీజర్‌‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ట్విట్టర్‌‌లో కొమరం భీమ్, రామరాజు ఫర్ భీమ్, రోర్ ఆఫ్ రామరాజు హ్యాష్ ట్యాగ్స్ పెద్దఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు దగ్గుబాటి రానా, హరీశ్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ఆర్ఆర్ఆర్ కొత్త టీజర్‌‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైల్డ్‌గా ఉన్నావ్ గురూ అంటూ టీజర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌ను ఉద్దేశించి రానా ట్వీట్ చేశాడు.

టీజర్ అద్భుతంగా ఉందని హీరోయిన్ రకుల్ ట్వీట్ చేసింది. తారక్, చరణ్, రాజమౌళికి గుడ్ లక్ చెప్పింది.

కరో్నా కారణంగా గత కొన్ని నెలలుగా అలుముకున్న నిరాశ, నిస్పృహ ఈ టీజర్‌‌తో పటాపంచలయ్యాయని డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం మీరు నిలబెట్టిన జెండా మాదిరి లేచి నిల్చున్నాయని పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ అద్భుతమని, ఒకరికొకరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్న ఆలోచన నచ్చిందంటూ హీరో సుశాంత్ ట్వీట్ చేశాడు. జక్కన్న విజన్ నుంచి మరో చారిత్రాత్మక చిత్రం రాబోతోందన్నాడు.

ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌‌కు ఫిట్‌‌నెస్ కోచ్‌‌గా పని చేస్తున్న లాయిడ్ స్టీవెన్స్ కూడా కొత్త టీజర్‌‌పై స్పందించాడు. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందన్నాడు.