ఇవాళ టెన్త్ , ఇంటర్ అడ్వాన్స్​డ్ ఫలితాలు

ఇవాళ టెన్త్ , ఇంటర్ అడ్వాన్స్​డ్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు:  టెన్త్, ఇంటర్ అడ్వాన్స్​ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం రిలీజ్ కానున్నాయి. పదో తరగతి ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు https://bse.telangana.gov.in వెబ్​సైట్​లో వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. కాగా, జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. 

ALSO READ :మోదీ టూర్‍కు వరంగల్ ముస్తాబు

ఈ పరీక్షలకు 70 వేల మంది అటెండ్ అయ్యారు. కాగా,  ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. రిజల్ట్​ కోసం https://tsbie.cgg.gov.in వెబ్ సైట్​ చూడాలని స్టూడెంట్లకు సూచించారు.