హైదరాబాద్, వెలుగు: స్టైపెండ్ వచ్చే నెల 2లోపు పెంచకుంటే 3 నుంచి సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ ఆఫీసులో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నోటీసు ఇచ్చింది. స్టైపెండ్ 15 శాతం పెంచి, జనవరి నుంచే అమలు చేయాలని డిమాండ్ చేసింది. మార్చి పెండింగ్ స్టైపెండ్‌ను వెంటనే జమ చేయాలని కోరింది. తమ సమస్యలను పరిష్కరించకుంటే మే 3 నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సర్వీసులను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది.

