V6 News

భార్య డైటీషియన్.. చంపేసి చెక్క బాక్సులో దాచేసి.. సిమెంటుతో కప్పెట్టేశాడు .. ఎలా దొరికాడంటే..

భార్య డైటీషియన్.. చంపేసి చెక్క బాక్సులో దాచేసి.. సిమెంటుతో కప్పెట్టేశాడు .. ఎలా దొరికాడంటే..

ప్రియుడి సాయంతో భర్తను చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంటు, నీళ్లు పోసిన ఘటన గుర్తుండే ఉంటుంది. దాదాపు అలాంటి ఇన్సిడెంటే ఇది. భార్యను చంపేసి.. పాడుబడ్డ ఇంట్లో చెక్కపెట్టెలో శవాన్ని దాచి సిమెంటు వేశాడో క్రూర భర్త. గుజరాత్ సూరత్ లో జరిగిన ఈ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్యను చంపి ఏమీ ఎరుగనట్లుగా మిస్సింగ్ కేసు పెట్టిన భర్తను పోలీసులు ఎలా గుర్తించారో తెలుసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించే క్రైమ్ కహానీ ఇది. 

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ సూరత్ లో విశాల్ సాల్వి (40) అనే వ్యక్తి తన భార్య శిల్ప సాల్వి (39) కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. నాలుగు రోజులుగా మిస్సైందని.. ఏదో అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. 

విశాల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతని ఇంట్లో దొరికిన లెటర్ ఆధారంగా అసలు దొంగ ఎదరో తేల్చేశారు. తనకు దొరికిన ఆ లెటర్ ను పోలీసులకు అప్పగించాడు విశాల్  చిన్న కొడుకు. ఆ లెటర్ లో.. నేను చాలా పెద్ద తప్పు చేశాను.. శిల్ప ఇక మనకు లేదు.. అని రాసిపెట్టాడు విశాల్. 

లెటర్ ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో.. హత్యకు పాల్పడిన విశాల్ నటన అంతా బయటపడిపోయింది. విచారణలో భాగంగా విశాల్ కుటుంబానికి చెందిన పాడుబడ్డ బంగ్లా ఒటకి గుర్తించారు. ఆ ఇంట్లో ఏదో కుళ్లిపోయిన వాసన వస్తుండటం గమనించి చెక్ చేశారు. ఓ మూలకు ఉన్న చెక్క పెట్టె తెరిచి చూడగా.. అందులో శవం. బాడీ మీద సిమెంట్ పోసి పెట్టెను లాక్ చేసి పెట్టాడు నిందితుడు. ప్రథామిక విచారణ ప్రకారం.. నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన మహిళ శవంగా గుర్తించారు. 

ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభించిన తమకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురైనట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ కనన్ దేశాయి చెప్పారు. నిందితుడే కంప్లైంట్ ఇచ్చి.. పోలీసుల పక్కనే ఉంటూ కేసును మిస్ లీడ్ చేయించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేధిక ఆధారంగా నిందితునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అనుమానంతోనే హత్య..

పోలీసుల విచారణలో భార్య భర్తలు గత కొంత కాలంగా గొడవలు పడుతూ వస్తున్నట్లు తేలింది. డైటీషియన్ అయిన భార్య శిల్పపై అనుమానం పెంచుకున్న తరచూ వేధిస్తూ ఉండేవడని తెలిసింది. పోలీసులకు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే లేపు నిందితుడైన భర్త విశాల్ సాల్వీ పరారైనట్లు చెప్పారు. సీసీటీవీ ఫూటేజ్ తో పాటు అన్ని ఆధారాలతో ట్రేస్ చేసి నిందితుడుని పట్టుకుంటామని తెలిపారు.